మునిగడపలో చోరీ

by Sridhar Babu |
మునిగడపలో చోరీ
X

దిశ, జగదేవ్ పూర్ : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడి చోరీకి పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం తలారి సాయిలు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం చేర్యాల మండలంలోని మర్రిముస్త్యాల గ్రామంలో తమ బంధువుల ఇంటికి దశదినకర్మకు వెళ్లారు.

దాంతో దొంగలు సాయిలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న తులం బంగారం, 40 వేల రూపాయలను ఎత్తుకెళ్లారు. కాగా శనివారం ఉదయం ఇంటికి వచ్చిన సాయిలు కుటుంబ సభ్యులు తాళం పగులగొట్టి ఉండడంతో జగదేవ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed