బీజేపీ ప్రముఖ నేతలు ఓట్లేసేదిక్కడే..

by Mahesh |   ( Updated:2023-11-29 16:05:21.0  )
బీజేపీ ప్రముఖ నేతలు ఓట్లేసేదిక్కడే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు బీజేపీకి చెందిన ప్రముఖులు ఆయా సెగ్మెంట్లలో తమ ఓట్లను వేయనున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గంలోని బర్కత్ పురలోని దీక్ష మోడల్ హై స్కూల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఓటు వేయనున్నారు. మలక్ పేట నియోజకవర్గం సలీంనగర్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ లో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ముషీరాబాద్ సెగ్మెంట్ రాంనగర్ లోని జేవీ హైస్కూల్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఓటు వేయనున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల నియోజకవర్గంలో ఎంఏఎల్‌డీ కాలేజీలో ఓటును వేయనున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జ్యోతి నగర్ సాధన స్కూల్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఓటు వేయనున్నారు. హుజురాబాద్ సెగ్మెంట్ కమలాపూర్ సెంట్రల్ ప్రైమరీ స్కూల్ లో ఈటల రాజేందర్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Advertisement

Next Story