‘అబద్ధం లోపల నిజం ఇదే..’ వాటిని ఉద్దేశిస్తూ స్మిత సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-23 12:51:03.0  )
‘అబద్ధం లోపల నిజం ఇదే..’ వాటిని ఉద్దేశిస్తూ స్మిత సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించి స్మితా సబర్వాల్ తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్మితా సబర్వాల్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా, మంగళవారం వరల్డ్ బుక్ డే సందర్భంగా ‘అబద్ధం లోపల నిజం ఇదే..’ అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఫిక్షన్ ఈస్ ది ట్రూత్ ఇన్ సైడ్ ది లై’ వరల్డ్ బుక్ డే సందర్భంగా అనేక పుస్తకాలను మీ బెస్ట్ ఫ్రెండ్స్ చేసుకోండి. కేవలం పుస్తకాలు మాత్రమే మనల్ని మనం విస్తరించుకోవడానికి.. మెదడులో ఇతర ఆలోచనల నుంచి ఎస్కెప్ కావడానికి దోహదపడతాయి..’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story