- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మమ్మల్ని KCR దూరం పెట్టడానికి అసలు రీజన్ ఇదే.. తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కాదనుకోవడం వల్లే తాము ఒంటరి పోరుకు వెళ్తున్నామన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్వభావం ఏంటో తమకు బాగా తెలుసని ఆ రెండు పార్టీలు బూర్జువా పార్టీలన్నారు. సీపీఎంను ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులతో పొత్తుతో కాంగ్రెస్‌కు నష్టం అని వారికి సీట్లు ఇస్తే ఓడిపోతామని కావాలంటే ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి సోనియా, ఖర్గేలను ఒప్పించి మంత్రి పదవులు ఇస్తామని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఇతనా మాకు మంత్రి పదవులు ఇప్పించేదని ప్రశ్నించారు. 1996లో ప్రతిపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చినప్పుడు అందరూ సీపీఎం నాయకుడు జ్యోతిబసు ప్రధానిగా అవకాశం వచ్చినా తిరస్కరిచామన్నారు. బీజేపీ దేశంలో స్వాంతంత్ర్యానికి పూర్వం నాటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్లేలా ఉన్నాయని విమర్శించారు. బీజేపీకి తొలుత సపోర్ట్ చేసి ఆ తర్వాత వ్యతిరేకించడానికి కేసీఆర్‌కు కారణాలు ఉంటే బీజేపీని వ్యతిరేకించడానికి కేసీఆర్‌ను ఒక ఆయుధంగా వాడుకోవాలనే కారణం మాకు ఉందని అన్నారు. ఇందువల్లే మునుగోడులో బీఆర్ఎస్‌తో స్నేహం ఏర్పడిందన్నారు. మునుగోడు ఉపఎన్నిక రాజగోపాల్ రెడ్డి స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాదన్నారు.
జాతీయ స్ధాయిలో బీజేపీ నేతలు దక్షిణ భారత దేశంలో బీజేపీ వ్యాప్తి వ్యూహంలో భాగంగా మునుగోడు ఉప ఎన్నిక వచ్చేదన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. కేటాయించే సీట్ల కోసం కేసీఆర్ తమను దూరం పెట్టలేదని రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌గా అవతరించడంతోనే తన ఆలోచన మారిందన్నారు. ఎవరితో పొత్తుల కోసం మేము వెంపర్లాడలేదని ఒంటరిగా పోటీకి సిద్ధం అవుతున్న తరుణంలో కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలే తమను తొలుత సంప్రదించారన్నారు. కానీ తాము బలంగా ఉన్న చోట తమ ఉనికినే ప్రశ్నార్థకంగా చేయాలని కుట్రతోని కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు.