- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy :సీనియర్ల తిరుగుబాటుపై రేవంత్ రియాక్షన్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: తిరుగుబాటు ప్రారంభించిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ల వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతోనే సమావేశం నిర్వహించామని స్పష్టం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా అభినందన తీర్మాణం పెట్టామని చెప్పారు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని కొత్త కమిటీలు ఏర్పాటు చేశామని అన్నారు.
కొత్త కమిటీల ఏర్పాటుతో పాత కమిటీలు రద్దు చేయబడ్డాయని తెలిపారు. డిసెంబర్ 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతీ ఇంటికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లేలా కార్యచరణ రూపొందిస్తామని వెల్లడించారు. అంతేగాకుండా.. వచ్చే ఏడాది జనవరి 3, 4వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం అవడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. బీఆర్ఎస్‌ను గద్దె దింపి ప్రజలకు మరోసారి అద్భుతమైన కాంగ్రెస్ పాలన అందిస్తామని అన్నారు. పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరిస్తామని ప్రకటించారు. పార్టీలో అంతర్గత విషయాలు ఏమైనా ఉంటే హైకమాండ్ పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను పెద్దగా చూడొద్దని అన్నారు.
READ MORE
పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతా: తదుపరి కార్యచరణ ప్రకటించిన రేవంత్ రెడ్డి
- Tags
- RevanthReddy