KTR : యువ వికాసం కాదు.. యువ విలాపమే : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-04 06:18:38.0  )
KTR : యువ వికాసం కాదు.. యువ విలాపమే : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) నిర్వహిస్తున్న యువ వికాసం(Yuva Vikasam) సంబరాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఏడాది పాలనా కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు.. యువ విలాపమని విమర్శించారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్..బోగస్ హామీలు, అబద్ధాలకు కేరాఫ్‌గా ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన సాగిందని ఫైర్ అయ్యారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు హామీ బోగస్ అని తేటతెల్లమైందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారని, 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడాయి మాటలు చెబుతుందని తప్పుబట్టారు. ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమేనని, టీచర్ పోస్టులు 5,973, గ్రూప్-1 60 నోటిఫికేషన్, స్టాఫ్ నర్స్ 6,494 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియమాక పత్రాలు ఇస్తూ కాంగ్రెస్ గొప్పలు పోతుందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు మరిచి.. నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్‌కు అధోగతే పడుతుందన్నారు. కాంగ్రెస్ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటామని, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ కాలెండర్, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీల తక్షణ ఆమలు కోసం యువత ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

Read More: Revanth: ప్రజా పాలనలో యువ వికాస వసంతం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed