- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ CM అభ్యర్థిపై కొనసాగుతోన్న సస్పెన్స్.. ఆ ఇద్దరి వల్లే ఎంపిక చివరి నిమిషంలో వాయిదా..!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ నెలకొన్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. రాజ్‌భవన్‌లోనూ జీఏడీ అధికారులు, ప్రొటోకాల్ ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం కాన్వాయిని సైతం సిద్ధం చేశారు. కానీ సీఎం ఎవరనేది ఇంకా హైకమాండ్ నిర్ణయించలేదని స్వయంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. సీఎం క్యాండిడేట్‌పై చర్చించేందుకు ముగ్గురు ఏఐసీసీ మెంబర్లతో కలసి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.
రేవంత్ పేరే ఖరారు..?
నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ కానున్నారు. రాష్ట్ర ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ఏఐసీసీ అబ్జర్వర్లంతా సీఎం అభ్యర్థిత్వంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీ అనుమతితో సీఎం ఎవరనేది ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనున్నది. ఇక రాజ్‌భవన్‌లోని సీఎంతో పాటు మరో నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే చాన్స్ ఉన్నది. ఇదిలా ఉండగా, ఇక రేవంత్ రెడ్డి పేరుని ఏఐసీసీ ఖరారు చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. డిసెంబరు 5, 6వ తేదీల్లో మంచి ముహుర్తం లేనందున 7న ప్రమాణ స్వీకారం చేసే చాన్స్ ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటి వరకు పార్టీ నుంచి కానీ, ఏఐసీసీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు.
ఎల్లా హోటల్ కేంద్రంగా..
రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో మకాం చేశారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేలందరి నుంచి ఏఐసీసీ అభిప్రాయాలను సేకరించి ఢిల్లీకి పంపించింది. సోనియా, రాహుల్, ఖర్గేతో చర్చించిన తర్వాత నిర్ణయం వెలువడుతుందని డీకే తెలిపారు. వాస్తవానికి ఎమ్మెల్యేలతో పాటు లీడర్ల అభిప్రాయం మేరకు సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి అని చర్చ జరిగిందని, కానీ సీనియర్లు అంసతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో సీఎం ఎంపికను హైకమాండ్‌కు వదిలేశారు. ఇదిలా ఉండగా సీఎం ఎంపిక ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో హైకమాండ్‌కు మరో చిక్కు వచ్చినట్టు తెలిసింది.
సీఎం పదవి కోసం పట్టు
సీఎం పదవి కోసం ఉత్తమ్, భట్టి డిమాండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సీఎం ఇవ్వకపోతే డిప్యూటీతో పాటు, భార్య పద్మావతికి మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ అడుగుతున్నట్టు తెలిసింది. ఇక తనకు డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ పదవి ఇవ్వాలని భట్టి విక్రమార్క హైకమాండ్‌ను కోరినట్టు ప్రచారం ఉన్నది. మరో వైపు భట్టికి డిప్యూటీ ఇస్తే తానేం కావాలని దామోదర్ రాజనర్సింహా అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రేవంత్‌కే మద్దతు ఇవ్వగా, ఆయన తమ్ముడు రాజగోపాల్ మాత్రం వెంకట్‌రెడ్డికే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే సీఎం అభ్యర్థి ఎంపికపై జాప్యం జరుగుతున్నది. అయితే ఈ వార్తలను భట్టి విక్రమార్క ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం ఎంపిక హైకమాండ్ చేతిలో ఉన్నదని, అప్పటి వరకు ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.
ఎమ్మెల్యేలంతా బెంగళూరు..?
సీఎం అభ్యర్థి ఎంపిక ఆలస్యం కావడంతో ప్రస్తుతం హైదరాబాద్ క్యాంపులోని ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించాలని హైకమాండ్ ప్లాన్ చేస్తున్నది. దీంతో ఎమ్మెల్యేలు కానీ నేతలందరినీ క్యాంపు వదిలి వెళ్లాలని పార్టీ నేతలు ఆదేశాలిచ్చారు. సీఎల్పీ నేత ఎంపికయ్యే వరకూ ప్రతి ఎమ్మెల్యే క్యాంపులోనే ఉండాలని ఏఐసీసీ ఆదేశాలిచ్చింది.
రేవంత్‌నే సీఎం చేయాలని నినాదాలు
రేవంత్‌రెడ్డినే సీఎం చేయాలని హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్, రాజ్‌భవన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీని గెలిపించిన రేవంత్‌ను కాదని, మరో వ్యక్తిని ఎంపిక చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దీంతో పార్టీలో గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది నేడు తేలనున్నది.
Read more : కాంగ్రెస్‌లోకి 12 మంది BRS ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం ఏర్పాటు కాగానే జాయినింగ్..?