- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది : పందిరి నాగిరెడ్డి
దిశ, కోదాడ : కోదాడ కాంగ్రెస్ అభ్యర్థిని పార్టీ ఎలక్షన్ కమిటీ ప్రకటిస్తుందని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లడాతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును ఆయన పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. ప్రజలపై ప్రభుత్వాలు పన్నుల భారం మోపుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి వంటి పథకాలను తెరపైకి తీసుకువచ్చిందని కొంతమందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. అనేక ప్రజా సంఘాల మద్దతుతో పాటు, విప్లవ భావాలు కలిగిన వ్యక్తిగా, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశలను సాధించాలనే లక్ష్యంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టానని తెలిపారు. రాజకీయంగా మా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారధ్యంలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తానన్నారు. ప్రస్తుతం కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నానని, తప్పనిసరిగా నా సేవలను గుర్తించి పార్టీ కోదాడ అసెంబ్లీ టికెట్ నాకే కేటాయిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం మేరకే కోదాడ అభ్యర్థి ప్రకటన ఉంటుందని అన్నారు.