- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంలో కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చే ప్రసక్తే లేదు.. ఈటల కీలక వ్యాఖ్యలు
దిశ, మేడ్చల్ బ్యూరో : ఐదు దశాబ్దాలపైన దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గత యూపీఏ హయాంలో ఐదేళ్ళ కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులను మార్చారో మనకు తెలుసునని, మళ్లీ ఇండియా కూటమి పేరుతో అతుకుల బొంతగా పార్టీలను కూడగట్టుకుని అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. శనివారం ఆల్వాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. దేశ ప్రధాని మోదీకి ప్రపంచంలోనే ఎదురులేదని, గొప్ప నాయకుడిగా పేరుపొందారని తెలిపారు. ప్రజలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయాలనుకుంటే అది అవివేకమని, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి ఓటు వేస్తేనే పార్లమెంట్ సభ్యులకు నిధులు అందుతాయని ఈటల స్సష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి శరవేగంగా సాగుతుందని, ప్రధాని మోదీకి భారత ప్రజలందరూ కుటుంబమేనని పేర్కొన్నారు. వ్యక్తిగత స్వార్థం లేకుండా దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడు మని ప్రధాని మోదీ అని స్పష్టంచేశారు. ఒక దేశం, ఒకే చట్టం అనే పద్దతిని ప్రధాని అమలు పరిచారని, ఎంతో కాలంగా ఉన్న కాశ్మీర్ సమస్యను సునాయాసంగా పరిష్కరించారని గుర్తు చేశారు. గతంలో ప్రపంచంలో ఏడవస్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ నేడు నాలుగవ స్థానానికి చేరిందని, టెక్నాలజీ అతి వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. మేకిన్ ఇండియా నినాదంతో అనేక పరిశ్రమలు ఏర్పడినట్లు ఈటల వెల్లడించారు.
గతంలో దేశవ్యాప్తంగా 75 ఎయిర్ పోర్టులు ఉంటే, నేడు 150 ఎయిర్ పోర్టులు ఏర్పడ్డాయని, నేషనల్ హైవేస్ అతి వేగంగా నిర్మాణం జరిగినట్లు తెలిపారు. రవాణా వ్యవస్థను అభివృద్ది చేయడం వల్ల ఒకచోట నుండి మరొక చోటుకు అతితక్కువ సమయంలో వెళ్లగలుగుతున్నామని తెలియజేశారు. కరోనా కాలంలో ప్రధాని మోదీ చూపిన చొరవ, ధైర్యం ఎంతో గొప్పవని, ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ను అందించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ప్రపంచ దేశాలన్నీ ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని ఈటల తెలిపారు. అతి పెద్దదైన ఈ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతాయో అని ఇతర పార్టీలు ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలు తలుచుకుంటే ధర్మంగా ఓట్లు వేసి బీజేపీని గెలిపిస్తారని నాకు తెలుసు. ప్రధాని మోదీ కేవలం ప్రజల ఆశీర్వాదాన్నే కోరుతున్నారు. నా పార్టీ గుర్తు మీకు తెలుసు. నేనేంటో మీకు తెలుసు. గత 22 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నాను. ధర్మాన్ని నిలబెట్టుకుని బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి, సంపూర్ణ ఆశీర్వాదం ఇస్తారని ఆశిస్తున్నానని ఈటల అభ్యర్థించారు.