- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడు రజాకార్లు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం.. వారి టార్గెట్ ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో : భారత సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆనాడు రజాకార్లు ప్రయతించారని, అయితే వారందరూ కాలగర్భంలో కలిసిపోయారని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. అప్పుడు జరిగిందే.. నేడు తెలంగాణలో కూడా జరుగుతోందని, సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారు కూడా కాలగర్భంలో కలిసిపోతారని ఆమె ఘాటు విమర్శలు చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ వద్ద శోభాయాత్రకు ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భారీ వర్షం కూడా లెక్కచేయకుండా ప్రజలు శోభాయాత్రకు తరలివచ్చారని, ఉత్సాహమైన వాతావరణంలో సాగర తీరం తరలి వెళ్లడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి అందరూ కంకణబద్దులై ఉండాలని ఆమె కోరారు. మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్‌తో పాటు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. ప్రజలలో కులవిభేదాలు, వర్గవిభేదాలు లేవని, అంతా ఒక్కటేనని చెప్పుకొచ్చారు.
కొత్త పార్లమెంట్ భవనంలో భారత సంస్కృతిని ఉట్టి పడేలా నిర్మించారని ఆమె చెప్పారు. 2012లో తాను ఎమ్మెలేగా హైదరాబాద్ నగరంలో జరిగిన శోభయాత్రలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. 11 ఏండ్ల తరువాత భాగ్యనగర్ గణేష్ ఉత్సవ శోభయాత్రలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. ఒక్కప్పుడు రామ మందిర్ నిర్మిస్తామని చెప్పుకునేవారమని, కానీ ఇప్పుడు నిర్మాణం చేసుకుంటున్నామని ఆమె తెలిపారు. 2024 జనవరి 2వ తేదీన అయోధ్య రాముడిని దర్శనం కూడా చేసుకోవచ్చన్నారు. అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఒక్కప్పుడు భాగ్యనగరంలో మాత్రమే శోభాయాత్ర ఘనంగా నిర్వహించేవారని, కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం కొనసాగుతోందన్నారు.