మంత్రుల మేడిగడ్డ పర్యటన ఖరారు.. వాళ్లంతా రావాలని ఆదేశం

by GSrikanth |
మంత్రుల మేడిగడ్డ పర్యటన ఖరారు.. వాళ్లంతా రావాలని ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుల మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన పర్యటన ఖరారైంది. ఈ నెల 29న వారు మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మంత్రులు మేడిగడ్డకు వెళ్లనున్నారు. బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలను వివరించనున్నారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్‌ల సమస్యల పరిష్కారాలపై చర్చిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లలందరూ ఈ పర్యటనకు రావాలని ఆదేశించారు.

Advertisement

Next Story