మంచంపై గ‌ర్భిణిని 3 కిలోమీట‌ర్లు మోసిన గ్రామ‌స్తులు

by GSrikanth |
మంచంపై గ‌ర్భిణిని 3 కిలోమీట‌ర్లు మోసిన గ్రామ‌స్తులు
X

దిశ‌, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రాయబంధంకు చెందిన సోది పోసి అనే గొత్తికోయ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో స్థానిక ఆశా వర్కర్ 108కు సమాచారం అందించారు. అయితే రాయబంధం గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక 3 కి. మీ దూరంలోనే అంబులెన్స్ ను సిబ్బంది నిలిపివేశారు. దీంతో గ్రామస్థులు సోమవారం తెల్లవారుజామున గర్భిణిని మంచానికి తాళ్లు కట్టి 3 కి. మీ మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించి ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story