ఖమ్మంలో ఉద్రిక్తత.. హరీశ్ రావు, పువ్వాడ, సబిత వాహనాలపై రాళ్ల దాడి

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-03 15:16:34.0  )
ఖమ్మంలో ఉద్రిక్తత.. హరీశ్ రావు, పువ్వాడ, సబిత వాహనాలపై రాళ్ల దాడి
X

దిశ, వెబ్‌డెస్క్/ఖమ్మం సిటీ: ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి మంగళవారం మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ లోక్‌సభ సభ్యుడు నామా నాగేశ్వర్ రావు వచ్చారు. ఈ సమయంలో అనూహ్యంగా కొందరు వారి వాహనాలపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో మాజీ మంత్రుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమై.. రాళ్లు రువ్విన వారిపై దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేశారు. కాగా, అంతకుముందు సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలోని రామచంద్రపురం, నాయకనిగూడెం గ్రామాల పంట పొలాలను బీఆర్ఎస్ నేతలు ప‌రిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. కాలువను పరిశీలించి, గ్రామ ప్రజలతో మాట్లాడారు.

Advertisement

Next Story

Most Viewed