- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందీ కలిపింది ఆ ఇద్దరు రాష్ట్ర కీలక నేతలని?
దిశ, వెబ్ డెస్క్: రెండు విభిన్న ధృవాలు.. ఒకరు సీఎం కూతురు కాగా మరొకరు టీపీసీసీ చీఫ్.. ఎంపీగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తునే రాష్ట్రంలో కీలక మహిళా నేతగా కవిత పొందారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. వీరిద్దరి మధ్య రాష్ట్రంలోని కీలక అంశాలపై ట్విట్టర్ వేదికగా ఫైట్ కొనసాగుతూ ఉంటుంది. ఏ అంశమైన ట్విట్టర్ వేదికగా వెంటనే స్పందిస్తూ ఉంటారు. వీరి మధ్య హాట్ టాపిక్స్‌పై మాటల యుద్ధంతో పాటు ట్వీట్ వార్ కొనసాగుతుంది.
ఇటీవల నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా కవిత ట్వీట్‌కు రేవంత్ రెడ్డి బదులిస్తూ ''వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే, బతుకమ్మ ఆడినందుకే బోనం కుండలు ఎత్తినందుకే మీ ఇంటిల్లిపాది సకల పదవులు, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి అని ప్రశ్నించారు. అమరవీరుల బలిదానాలకు చంద్ర గ్రహణంలా దాపురించిన మీ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? అందుకే త్యాగాలు చేసిందెవరు, భోగాలు అనుభవిస్తోందెవరని యావత్ తెలంగాణ ఘోషిస్తుంది'' అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా కవిత ట్వీ్ట్ చేస్తూ ''చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం, బోనం, బతుకమ్మకే పరిమితం చేస్తూ మాట్లాడటం అనేది మహిళల పట్ల మీ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది'' అని కవిత ట్వీట్ చేశారు.
ఇలా పలు అంశాలపై రేవంత్ రెడ్డి, కవితల మధ్య ట్విట్టర్ వార్ నడవడం అది వార్తగా మారడం చూస్తూనే ఉన్నాం. కాగా ఇటీవల పార్లమెంట్ లో రూపాయితో డాలర్ మారకం విలువ విపరీతంగా పడిపోవడంపై రేవంత్ రెడ్డి హిందీలో మాట్లాడారు. డాలర్ విలువ ఇప్పుడు రూ.83.20కి పడిపోయిందని ఐసీయూకి చేరిన రూపాయిని ఇంటికి తీసుకురావడానికి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి నిర్మలా సీతారామన్ బదులిస్తూ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్లు తమ హిందీ బలహీనంగా ఉందని చెబుతున్నారు. బలహీనమైన హిందీకి బలహీనమైన హిందీలోనే సమాధానమిస్తానని తెలిపారు. ఆర్థిక మంత్రి తన భాషపై వ్యగ్యంగా మాట్లాడటాన్ని రేవంత్ రెడ్డి తప్పు బట్టారు. ఇదే అంశాన్ని నిన్న మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కవిత ఊటంకించారు. నిర్మలా సీతారామన్ తెలంగాణను అవమానించేలా మాట్లాడారన్నారు. బీజేపీ నాయకులు హిందీ గురించి మాట్లాడటం కాదని రూపాయి మారకం విలువ గురించి మాట్లాడాలని రేవంత్ రెడ్డికి బాసటగా నిలిచారు. బీజేపీ నాయకులు భాష గురించి కాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. అనేక అంశాల్లో విబేధించే కవిత రేవంత్ రెడ్డిలను హిందీ భాష ఏకం చేసిందనే చర్చ సాగుతోంది.
Also Read....