ఈ కుబేర్ లో అన్నీ పెండింగే.. మంత్రి హరీశ్ రావుకు టీఆర్ టీఎఫ్​ నేతల ఫిర్యాదు

by Javid Pasha |
ఈ కుబేర్ లో అన్నీ పెండింగే.. మంత్రి హరీశ్ రావుకు టీఆర్ టీఎఫ్​ నేతల ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ కుబేర్ లో పెండింగ్ బిల్లులను తెలంగాణ సర్కార్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కావలి అశోక్ కుమార్, కటకం రమేశ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు సంబంధించి జీపీఎఫ్, పార్ట్ ఫైనల్స్, అడ్వాన్సులు, ఫైనల్ పేమెంట్స్, టీఎస్ జీఎల్ఐ చెక్కులు, మెడికల్ రీయింబర్స్ మెంట్, సరెండర్ లీవ్, సప్లిమెంటరీ వేతనం, అటోమెటిక్ అడ్వాన్స్ మెంట్, పీఆర్సీ ఏరియర్స్, రిటైర్డ్ ఉపాధ్యాయుల కమ్యూటేషన్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ తదితర బిల్లులు 2022 ఏప్రిల్ నుంచి నేటి వరకు మంజూరు కాలేదన్నారు.

ఇవన్నీ ఈ-కుబేర్ లో పెండింగులో ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీనివల్ల ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ కుటుంబ అవసరాలకు డబ్బులు అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండంటంతో పెండింగులో పెట్టిన బిల్లులను ఈ నెలాఖరులోగా మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఉపాధ్యాయులు, పెన్షనర్లు మళ్ళీ బిల్లులను ఎస్టీవో, ఏటీవో, డీటీవోలలో తిరిగి సమర్పించాల్సి వస్తుందని, దీనివల్ల ఇబ్బంది తలెత్తే అవకాశముందన్నారు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story