- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ పార్టీలకు ‘పొలిటికల్’ సినిమాల టెన్షన్!
దిశ, వెబ్‌డెస్క్: సినిమాకు అనేక అంశాలను ప్రభావితం చేసే శక్తి ఉంది. అయితే పాలిటిక్స్‌ను సైతం సినిమాలు ఇన్‌ఫ్యూయెన్స్ చేస్తాయనడంలో సందేహం లేదు. ఇక తాజాగా తెరకెక్కుతున్న మూడు సినిమాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్‌టాపిక్‌గా మారాయి.
నిజాం పాలనపై ‘రజాకర్’
బీజేపీ తెలంగాణ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ‘రజాకర్’ మూవీ ఇప్పటికే పాలిటిక్స్‌ను షేక్ చేసింది. ట్రైలర్ విడుదల తర్వాత ఈ మూవీపై మంత్రి కేటీఆర్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక, తెలంగాణ సాయుధ పోరాటంలో తెగువ, రజాకర్ల అకృత్యాలను ఈ సినిమాలో తెరకెక్కించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఆనాడు జరిగిన దారుణాలను ట్రైలర్ లో సూపర్ గా చూయించారని చెబుతుండగా, బీఆర్ఎస్ మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదంటోంది. ఇక బీజేపీ మాత్రం ఈ మూవీతో తమకు ప్లస్ అవుతుందని భావిస్తోంది. ముస్లిం మత పెద్దలు మాత్రం ముస్లింలను బూచిగా చూపుతున్నారని ఫైర్ అవుతున్నారు. అదే ఎజెండాతో ‘కశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ తెరకెక్కించారని మండి పడుతున్నారు.
ఏపీ పాలిటిక్స్‌పై ‘వ్యూహం’
ఏపీ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కష్టాలు, పాలిటిక్స్‌లో ఆయన అనుసరించిన వ్యూహాలపై రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో చంద్రబాబు ఫెయిల్యూర్లను ఆర్జీవీ వెండితెరపై తెరకెక్కించారు. ఈ సినిమాకు వైసీపీ శ్రేణులు మద్దతు తెలుపుతుండగా.. టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. గతంలో కూడా ఆర్జీవీ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ వంటి సినిమాలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఇక, వైసీపీకి మద్దతు తెలిపే ఆర్జీవీ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై తరచూ విరుచుకుపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో సైతం వారి క్యారెక్టర్లను ఆర్జీవీ చేర్చారు.
బీజేపీ టార్గెట్‌గా అద్దంకి దయాకర్ మూవీ..
తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బీజేపీ రాజకీయాలు, సనాతన ధర్మం మూలాలు, మతం, కరోనా వైరస్ బీజేపీ డీఎన్ఏ ఒకటే అని ఈ సినిమా ద్వారా సందేశం ఇవ్వనున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే అనుసరించాల్సిన విధానాలను ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు. యువత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యకను తెలుసుకునేలా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు. ఇక, ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. మరి రానున్న ఎన్నికలపై ఈ మూడు సినిమాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ఆసక్తిగా మారింది.