హైదరాబాద్‌లో Munawar Faruqui కామెడీ షోకు అనుమతి

by Nagaya |   ( Updated:2022-08-19 07:00:26.0  )
హైదరాబాద్‌లో Munawar Faruqui కామెడీ షోకు అనుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: మునావర్ ఫారుఖీ కామెడీ షోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం (ఆగస్టు 20) నాడు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో షో నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. బీజేపీ నేతల అభ్యంతరాలను తోసిపుచ్చి మునావర్ షోకు పర్మిషన్ ఇవ్వడం గమనార్హం. కాగా, గతంలో బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మునావర్ షోకు అనుమతి ఇవ్వొద్దని సూచనలు చేశారు. హిందూ దేవతలను కించపరిచేలా ఆయన కామెడీ ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని పోలీసులను హిందూ సంఘాలు కోరాయి. ఒకవేళ పర్మిషన్ ఇస్తే.. సభా స్థలిని కూల్చేస్తామని, తగలబెడతామని రాజాసింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story