- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలీసు శాఖలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను తెలంగాణ పోలీసులు ఘనంగా జరిపారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఐజీ (పర్సనల్) కమలాసన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐపీఎస్అధికారులు పాల్గొన్నారు. ఇక, హైదరాబాద్ పోలీస్ కమాండ్కంట్రోల్లో జాయింట్కమిషనర్(అడ్మిన్) పరిమళ హన నూతన్ శుక్రవారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి హాజరైన సిబ్బంది అందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఇక, సైబరాబాద్కమిషనరేట్లో సైబర్ క్రైమ్స్దీసీపీ రితిరాజ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. అంతకు ముందు సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా డీసీపీ రితిరాజ్మాట్లాడుతూ ఉద్యమకారుల పోరాటం..ఎంతోమంది ప్రాణత్యాగాలతో 2014, జూన్2న తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్అందిస్తున్న సహకారంతో తెలంగాణ పోలీసులు అన్ని విభాగాల్లో ముందుండి దేశానికే ఆదర్శంగా నిలిచారని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషి వల్లనే తెలంగాణ సురక్షిత రాష్ర్టంగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో ఎనకామిక్అఫెన్సెస్వింగ్డీసీపీ కవిత, అదనపు డీసీపీలు ఎల్సీ.నాయక్, నంధ్యాల నరసింహారెడ్డి, ఎస్పీ రవీందర్, ఏసీపీ మట్టయ్య, సీఏఓ అడ్మిన్గీత, అకౌంటెంట్చంద్రకళతోపాటు మినిస్టీరియల్ఉద్యోగులు పాల్గొన్నారు.
సేవా పతకాలు అందించిన సీపీ..
ఇక, తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ ఉత్సవాలను పురస్కరించుకుని విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన పోలీస్సేవా పతకాలను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా రక్షణలో అసామాన్యమైన ప్రతిభ కనబరిచిన సిబ్బందికి గుర్తింపును ఇవ్వటంతోపాటు మరింతగా ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం సేవా పతకాలను ఇస్తుందన్నారు. పతకాలు పొందినవారు, పొందనివారు మరింత స్పూర్తితో విధులను నిర్వర్తించటం ద్వారా శాంతిభద్రతల పరిరక్షణలో సత్ఫలితాలు సాధించాలని చెప్పారు. 2022 సంవత్సరానికిగాను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న మొత్తం 93మంది పోలీసు సిబ్బందికి పతకాలు, ప్రశంసాపత్రాలు అందచేశారు.
వీటిలో ఎనిమిది అతి ఉత్కృష్ట, పద్దెనిమిది ఉత్కృష్ట, పది సేవా పతకాలతోపాటు ముప్పయి ఆరు మెడల్స్, యాభై ఏడు ప్రశంసాపత్రాలు ఉన్నాయి. పతకాలు, మెడల్స్, ప్రశంసాపత్రాలు పొందిన వారిలో హోంగార్డు మొదలుకుని అదనపు డీసీపీ స్థాయి అధికారి వరకు ఉండటం గమనార్హం. కార్యక్రమంలో జాయింట్సీపీ (ట్రాఫిక్) నారాయణ్నాయక్తోపాటు ఐపీఎస్అధికారులు యోగేష్గౌతమ్, రితిరాజ్, నితికా పంత్, రష్మి పెరుమల్, కవిత, శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, జగదీశ్వర్రెడ్డి, శ్రీనివాసరావు, సందీప్ తోపాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.