ఆ ఎమ్మెల్యేపై అసెంబ్లీ స్పీకర్​చర్యలు తీసుకోవాలి.. తెలంగాణ ఐపీఎస్​ఆఫీసర్స్​అసోసియేషన్​

by Javid Pasha |   ( Updated:2023-04-05 08:36:31.0  )
ఆ ఎమ్మెల్యేపై అసెంబ్లీ స్పీకర్​చర్యలు తీసుకోవాలి.. తెలంగాణ ఐపీఎస్​ఆఫీసర్స్​అసోసియేషన్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​అరెస్టు నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్​ప్రతిష్టను దెబ్బ తీసేలా ఎమ్మెల్యే రఘునందన్​రావు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్​అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన అసోసియేషన్​జాయింట్​సెక్రటరీ డీఐజీ (ఉమెన్​సేఫ్టీ) సుమతి పోలీసుశాఖ ప్రతిష్టను దెబ్బ తీసేలా మాట్లాడిన రఘునందన్​రావుపై అసెంబ్లీ స్పీకర్​క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక శాసనసభ్యుడై ఉండి రఘునందన్​రావు అభ్యంతరకరమైన భాషలో సీనియర్​ఐపీఎస్​అధికారి అయిన అంజనీకుమార్​పై వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ఇలాంటి పరిణామాలు మొత్తం పోలీసు సిబ్బంది మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తాయని వ్యాఖ్యానించారు. ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, అధికారులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు.

Advertisement

Next Story