- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓవైసీని ఓడించడమే టార్గెట్.. కాంగ్రెస్, బీజేపీ మైండ్ బ్లోయింగ్ స్కెచ్!
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు లోక్ సభ ఎలక్షన్స్‌పై దృష్టి సారించాయి. గెలుపునకు అవకాశం ఉన్న స్థానాలపై ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ హోదాలో ఉన్న పార్టీగా లోక్‌సభ ఎన్నికలను క్వీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటే వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ సైతం పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. అయితే బద్ద శత్రువులైన కాంగ్రెస్, బీజేపీలు హైదరాబాద్ లోక్‌సభ స్థానం విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నది.
టార్గెట్ అసద్
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై గురిపెట్టడం చర్చనీయాశంగా మారింది. దీంతో ఈ స్థానంలో ఏడు దశాబ్ధాల ఎంఐఎం చరిత్రకు బ్రేక్ పడబోతున్నదా అనే చర్చ జోరందుకుంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి ప్రస్తుతం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో గులాబీ పార్టీతో స్నేహం కొనసాగించిన ఓవైసీ తాను ఊహించినట్లుగానే ఓల్డ్ సిటీలోని ఏడు స్థానాలను దక్కించుకోగలిగినప్పటికీ ఓటు షేరింగ్ తగ్గిపోయింది. ఇదే సమయంలో హైదరాబాద్ స్థానంపై కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోగా.. ఈ స్థానంలో బోణీ కొట్టి సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ స్థానంపై ఇప్పటికే కాంగ్రెస్ కసరత్తు చేస్తుండగా ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన అమిత్ షా సైతం ఈ స్థానంపై ఫోకస్ పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్, బీజేపీల ఫోకస్‌తో అలర్ట్ అయిన ఓవైసీ తమ ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు సమాచారం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు గండిపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
సీన్ మారేనా?
హైదరాబాద్ లోక్ సభ పరిధిలో మలక్ పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్క గోషామహల్ మినహా మిగతా ఆరు చోట్ల ఎంఐఎం ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే గతంలో కైట్ పార్టీకి ఈ స్థానాల్లో విజయం నల్లేరు మీద నడకలా ఉన్న ఈసారి మాత్రం అంతా ఈజీ కాలేదు. కౌంటింగ్‌లో ఫలితం చివరి వరకు ఉత్కంఠ రేపింది. దీంతో కాంగ్రెస్, కమలం పార్టీలు ఈసారి హైదరాబాద్ స్థానంలో గురిపెడితే వరుసగా తొమ్మిసార్లు విజయకేతనం ఎగురవేస్తూ వస్తున్న ఎంఐఎంకు ఈసారి గెలుపు అంతా సులువు కాకపోవచ్చనే చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో హైదరాబాద్ లోక్ సభ స్థానంలో బరిలో నిలపే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎంఐఎం నుంచి ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీనే పోటీ పడే అవకాశాలు ఉండటంతో ఆ మేరకు ఓవైసీని ఢీ కొట్టే నేత కోసం అగ్రనాయకత్వం వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ నుంచి మైనార్టీ నేతలు ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్‌తో పాటు మరికొందరు నేతల పేర్లు వినిపిస్తుండగా బీజేపీ నుంచి భగవంత్ రావు, రాజాసింగ్, విక్రమ్ గౌడ్ పేర్లు చక్కర్లు కొడుతుండగా అంతిమంగా విజయం ఎవరిని వరించబోతున్నది అనేది ఉత్కంఠగా మారుతోంది.