- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టులో BJP ఎంపీ అరవింద్‌కు చుక్కెదురు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఆయన విచారణను ఎదుర్కోవాల్సిందే అంటూ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఈ కేసుపై ఉన్న స్టేను కూడా హైకోర్టు వెకేట్ చేసింది. 2021, అక్టోబర్31న ఎంపీ ధర్మపురి అరవింద్ చెంచల్ గూడ జైల్లో ఉన్న నవీన్‌కుమార్ అలియాస్తీన్మార్ మల్లన్నను చెంచల్‌గూడ జైలుకు వచ్చి కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది పనికిమాలిన లొట్టపీసులు ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
దీనిపై ఓ సోషల్ వర్కర్ మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మాదన్నపేట పోలీస్ స్టేషన్‌తో పాటు నిజామాబాద్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్‌లను స్క్వాష్చే యాలని, దాంతో పాటు ఎలాంటి చర్యలు చేపట్టకుండా స్టే ఇవ్వాలని కోరుతూ గతంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దాంతో న్యాయస్థానం స్టే మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేసుపై ఉన్న స్టేను వెకేట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఎంపీ ధర్మపురి అరవింద్విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.