- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.2507 కోట్లు ఏమయ్యాయి.. హరితహారం కోసం వాడింది తక్కువే!!
దిశ, తెలంగాణ బ్యూరో: అటవీ అభివృద్ధి నిధులు గోల్మాల్ అయ్యాయి. ప్రభుత్వం వెచ్చించిన సొమ్ముకు లెక్కల్లేకుండా పోయాయి. అడవుల పెంపకం కోసం వాడాల్సిన సొమ్ము దారి మళ్లించినట్లు అనుమానిస్తున్నారు. 2020 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ. 3,110 కోట్లు విడుదలైతే.. అందులో ప్రభుత్వం ఖర్చు చేసినట్లుగా చూపిస్తున్నది కేవలం రూ.603 కోట్లు మాత్రమే. దీంతో మిగిలిన సొమ్ము ఏమైందో ప్రభుత్వం చెప్పడం లేదు.
లెక్కల మాయ
ప్రభుత్వం హరితహారం కోసం ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టినట్లు ప్రకటించింది. ఎనిమిది విడుతల్లో 217 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడిస్తోంది. దీనిలో అటవీ ప్రాంతంలో 30 కోట్ల మొక్కలు నాటాల్సి ఉండగా.. దాదాపుగా 20 కోట్లు నాటినట్లు చెప్తోంది. అయితే, నిధుల వినియోగంలో మాత్రం తప్పుడు లెక్కలు ప్రదర్శిస్తోంది. గడిచిన ఐదేండ్లలో రూ.4 వేల కోట్లు ఖర్చు పెడితే అందులో విభాగాల వారీగా లెక్కలు చెప్తున్నారు. దీనిలో కంపా నిధులు కేవలం రూ. 603 కోట్లు వాడినట్లు ప్రభుత్వం గతంలోనే అధికారికంగా ప్రకటించింది. గ్రీన్ ట్యాక్స్, జీహెచ్ఎంసీ, నరేగా నిధులను వాడుకున్నట్లు వెల్లడించింది.
కానీ, ఇటీవల రాజ్యసభలో కంపా నిధుల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ. 1478 కోట్లు వినియోగించినట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపా ఫండ్స్రూ. 488 కోట్లు వినియోగించినట్లు వెల్లడైంది. ఈ సొమ్ముతో 12,651 హెక్టార్ల అడవుల్లో మొక్కలు పెంచినట్లు రిపోర్ట్‌లో సూచించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రకటించిన ఖర్చు మాత్రం రూ. 603 కోట్లు. దీంతో కంపా నిధులు ఎక్కడ, ఎందుకు వాడారో స్పష్టత లేకుండా పోయింది. కంపా కింద విడుదలైన నిధుల్లో రూ. 2507 కోట్లకు లెక్కాపత్రం లేకుండా పోయింది. ప్రభుత్వం చెప్తున్న లెక్కలే తప్పుగా మారాయి. 2020 ఫైనాన్సియర్వరకు రూ. 3110 కోట్లు రాష్ట్రానికి వస్తే.. అందులో సర్కారు ప్రకటించిన సొమ్ము రూ. 603 కోట్లు మాత్రమే.
కండువాల ఖర్చు కూడా కంపా లోనే..!
హరితహారం కోసం ప్రభుత్వం చేసిన అర్బాటాలన్నీ కంపా నిధుల్లోనూ చూపించినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఏడు విడుతల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు మెడలో వేసుకున్న కండువాల ఖర్చు ఏకంగా రూ.8.02 కోట్లుగా నమోదైంది. ప్రతీఏటా హరితహారం నిర్వహణలో కండువాలు, టోపీల కోసం కోటిన్నరకుపైగా ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కంపా ఫండ్సే కావడం గమనార్హం. వాస్తవానికి హరితహారం కోసం రాష్ట్ర సర్కారు చేస్తున్న ఖర్చులో కేంద్ర ప్రభుత్వ నిధులే ఎక్కువగా ఉంటున్నాయని స్పష్టమవుతోంది. ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం కేంద్రం ఇచ్చిన 'కంపా' ఫండ్స్‌తో పాటుగా ఉపాధి హామీ పథకం కోసం కేంద్రం ఇచ్చే నిధులనే హరితహారం కోసం వాడుతున్నారు. గడిచిన ఐదేండ్లలో ఖర్చు చేసిన దాంట్లో రూ.2,279.53 కోట్లు ఉపాధి హామీ నిధులే ఉన్నాయి. కంపా నిధులు రూ.603 కోట్లున్నాయి.
మళ్లించినట్టేనా..?
మొక్కల పెంపకం కోసం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి ఇచ్చే ఫండ్స్మొత్తం ఇదే విధంగా వాడుకుంటున్నారు. వాస్తవానికి కంపా నిధులకు ప్రత్యేకత ఉంటోంది. రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు, ఇతర అవసరాలకు అటవీ భూములను సేకరిస్తే కంపా కింద భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎలాంటి మినహాయింపు లేదు. క్షీణించిన అడవుల్లో హెక్టార్‌కు రూ.6 లక్షలు, రిజర్వ్ ఫారెస్ట్‌కు రూ.8 లక్షలు, దట్టమైన అడవుల్లో హెక్టారుకు రూ.10 లక్షల చొప్పున నెట్ ప్రాఫిట్ వ్యాల్యూ కింద చెల్లించాల్సి ఉంటుంది. చెట్లకు కూడా ఖరీదు కడుతారు. ఇలా వసూలైన మొత్తాన్ని ఢిల్లీలోని కంపా అడ్‌హాక్ అకౌంట్ కింద ఆయా రాష్ట్రాల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే, ఈ మొత్తంలో 10 శాతం మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అటవీ అభివృద్ధి కోసం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలుండేవి. కానీ, 2020లో మార్పుచేసిన కంపా చట్టం ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాల్లో 90 శాతం నిధులను సంబంధిత రాష్ట్రాల ఖజానాకు తరలించి ప్రత్యేక అకౌంట్ కింద జమ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణకు కంపా అకౌంట్ కింద జమైన రూ.3,110 కోట్ల డిపాజిట్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 2020 ఆర్థిక సంవత్సరంలో బదిలీ చేసింది. రాష్ట్రాలు సమర్పించే అడవుల అభివృద్ధి పనుల కార్యచరణ నివేదికను కేంద్రం అనుమతించిన తర్వాతనే ఈ నిధులను వినియోగించుకొనే వెసులుబాటు ఉంది. ఇలా హరితహారం, అడవుల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలతో కేంద్రం ఈ నిధులను రాష్ట్రానికి జమ చేసింది. ఈ విధంగా వచ్చిన కంపా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 8వ విడుత హరితహారం ఇంకా నిర్వహిస్తున్న నేపథ్యంలో కంపా నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లెక్కాపత్రం బయటకు రావడం లేదు.
Also Read...
న్యూ ఇయర్‌లో టీ-కాంగ్రెస్‌కు కొత్త బాస్.. రేసులో ముగ్గురు సీనియర్లు!!