TSPSC paper leak: 6 రోజుల సిట్ కస్టడీకి టీఎస్పీఎస్సీ నిందితులు

by Javid Pasha |   ( Updated:2023-03-17 11:51:38.0  )
TSPSC paper leak: 6 రోజుల సిట్ కస్టడీకి  టీఎస్పీఎస్సీ నిందితులు
X

దిశ, వెబ్ డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితులకు 6 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతినిస్తూ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుకతో పాటు మొత్తం 9మందిని సిట్ విచారణ నిమిత్తం రేపటి నుంచి ఈ నెల 23వరకు పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న నిందితులను రేపు సిట్ అదుపులోకి తీసుకోనుంది. విచారణలో భాగంగా పేపర్ లీక్ కు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టనుంది. ఏఏ పేపర్లు లీక్ అయ్యాయి? లీకేజీతో ఎంతమందికి సంబంధం ఉంది? అనే పలు విషయాల గురించి నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed