నూతన విద్యావిధానం-2020 రద్దు చేయాలి.. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్

by Javid Pasha |
నూతన విద్యావిధానం-2020 రద్దు చేయాలి.. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పేద వర్గాలకు చదువును దూరం చేసే నూతన జాతీయ విద్యావిధానం 2020 రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 1 వ తేదిన "ఛలో రాజ్ భవన్ " కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆదివారం ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజులు మాట్లడుతూ.. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకుని వస్తుందని, ప్రభుత్వ విద్యను నష్టం చేసి ప్రైవేట్, కార్పోరేట్ సెక్టార్ కు లాభం చేసే చర్యలను తీసుకుని వస్తుందని ఆరోపించారు.

ఇందులో భాగంగా ప్రాథమిక విద్యారంగంలో డ్రౌఫట్స్ పెంచేలా మళ్ళీ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ తీసుకుని వచ్చే విధానాన్ని తీసుకువస్తుందని వారు విమర్శించారు. పరిశోధన,ఫెలోషిప్లు లేకుండా వీదేశీ యూనివర్శీటీలే ఈ దేశంలోకి స్వేచ్ఛగా వచ్చే విధానాలు ఈ నూతన విద్యావిధానం పేరుతో అమలు చేయాలని చూస్తున్నారు. యూజీసీ రద్దు చేసి ప్రైవేట్, ప్రభుత్వ వ్యక్తులు భాగస్వామ్యం తో గవర్నింగ్ బాడీని తేవడం అంటేనే విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడంలో బాగామన్నారు . ఆరెస్సెస్ ఎజెండా విద్యా రంగంలో అమలు చేసే విద్యా విధానం నూతన విద్యావిధానమని అన్నారు. అందుకే సిలబస్ లో మార్పులు తెచ్చి, జాతీయోద్యమ వీరుల చరిత్రలు మార్చడం, డార్విన్ సిద్దాంతం మార్చడం లాంటివి చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story