- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుణమాఫీపై CM రేవంత్ రెడ్డి ప్రకటన వెనక రహస్యమిదే.. హరీష్ రావు సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: పంట రుణాల మాఫీపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ నారాయణ పేట జిల్లాలో నిర్వహించిన జన జాతర సభలో ప్రకటన చేశారు. ఇక, ఈ ప్రకటనపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ‘పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలి.
రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారు. ఎకరానికి 15000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు ? వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదు? మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు 2500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమయింది ? 4 వేలకు పెంచుతామన్న పెన్షన్ను ఎప్పుడు పెంచి ఇస్తారు? ఇచ్చిన హామీలను అమలు చేసే సిద్ధ శుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓడిపోతామని భయంతోనే మళ్లీ కొత్తగా హామీలు ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు మీపై నమ్మకం కోల్పోయారు.’ అని ట్వీట్ చేశారు.