- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ రథయాత్రల షెడ్యూల్ మరోసారి మార్పు
దిశ, డైనమిక్ బ్యూరో:బీజేపీ రథయాత్ర మరోసారి వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంతో రాష్ట్రంలోని పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ రథయాత్రలకు ప్లాన్ చేసింది. 17 లోక్ సభ స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించి తొలుత ఈ నెల 5 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు యాత్రలు చేపట్టాలని పార్టీ నేతలు భావించారు. అయితే బడ్జెట్ సమావేశాలు, ఇతర కారణాలతో దానిని 10వ తేదీకి మార్చారు. 10 నుంచి 19 వరకు నిర్వహించాలని భావించారు. అయితే ఈ నెల 16,17,18వ తేదీల్లో బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ జరగనున్నాయి. ఈ సమావేశాలకు రాష్ట్ర నాయకత్వంతో పాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేతలు తరలి వెళ్లాల్సి ఉంటుంది. అనుకున్న ప్రకారం ఒక వేళ రథయాత్ర చేపట్టినా మధ్యలో మళ్లీ మూడు రోజులు విరామం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈనెల 10 నుంచి ప్రారంభం కావాల్సిన రథయాత్ర షెడ్యూల్ ను మరోసారి మార్చారు. ఈనెల 20 నుంచి 5 పార్లమెంట్ క్లస్టర్లలలో యాత్రలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఆలోపు ఎన్నికల షెడ్యూల్ వస్తే యాత్రలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.