- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహిళను దారుణంగా తిట్టిన ఆర్టీసీ డ్రైవర్..? (వీడియో)

దిశ, డైనమిక్ బ్యూరో: మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభైనప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బంది నుంచి తమకు సరైన గౌరవం లభించడం లేదని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. అసలు మహిళలు కనబడితే బస్సులు ఆపడం లేదని సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బస్సు ఆపకుండా బస్ డ్రైవర్ మహిళను తిట్టాడని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇవాళ ఉదయం ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తనను తిట్టాడని ఓ మహిళ ఆరోపిస్తూ వీడియో తీసింది.
బస్సు ఆపకుండా తనను ‘నీ అమ్మ’ అని డ్రైవర్ తిట్టాడని వీడియో తీస్తున్న సదరు మహిళ ఆరోపించారు. మరోవైపు ఆ బస్సు డ్రైవర్.. ఆ మహిళను తాను తిట్టలేదని చెబుతుంటాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో టీఎస్ ఆర్టీసీ స్పందించింది. ఘటనపై విచారణ చేపడతామని నెటిజన్లకు హామీ ఇచ్చింది.