- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైస్ మిల్లుల్లో అవకతవకలు నిజమే.. రైస్ మిల్లర్ల అసోసియేషన్
దిశ , తెలంగాణ బ్యూరో : ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టమ్స్ మిలింగ్ రైస్ ( సిఎంఆర్ ) విషయంలో కొన్ని మిల్లులు ఇవ్వలేక పోవడం అవకతవకలకు పాల్పడి వుంటారు. వారి విషయంలో ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని రైస్ మిల్లెర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. నాగేందర్ పేర్కొన్నారు .మంగళవారం రైస్ మిల్లెర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ.. కొంతమంది రైస్ మిల్లర్లు తప్పు చేయడం వల్ల అందరిని అదే గాడిన పట్టడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్కు ధాన్యం కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ మమల్ని ఇబ్బందులు పెడుతుంటే, మరోప్రక్క మిల్లింగ్ చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు సరిపడా ఎఫ్సిఐ గోదాముల్లో నిల్వ సామర్థ్యం లేకపోవడం మూలాన మిల్లులోనే ధాన్యం వుండడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యాళతం చేసారు . ఈ అంశంపై తాము ఎఫ్ సి ఐ ఉన్నతాధికారులకు విన్నవించినా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని చేతులు దులుపుకుంటున్నారని అయన ఆరోపించారు.
దేశంలో మిగతా రాష్టాలలో సంవత్సరానికి ఒక పంట ఉండడం మూలాన ఆయా రాష్టాల్లో ధాన్యానికి సరిపడా గోదాములు వుండడం వలన సమస్య ఉత్పన్నం కావడం లేదని తెలిపారు . కానీ తెలంగాణాలో రెండు పంటలు రావడం వలన ఈ ఏడాది దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల అధిక ధాన్యం ఉత్పత్తి మార్కెట్ కు రావడం వలన నిల్వచేసే సామర్థ్యం గల ఎఫ్ సి ఐ గోదాములు సరిపడా లేకపోవడం వలన, రాక్ మూవ్ మెంట్ పెంచకపోవడం ,వ్యాగన్ల ను కేటాయించకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని అన్నారు. దీంతో పాటు ఎఫ్ సి ఐ అధికారులు మిల్లింగ్ అయినా బియ్యం విషయంలో నాణ్యత ప్రమాణాల పేరిట సరైన అప్పియరెన్స్ లేదని నిరాకరిస్తూ తమల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు . ఇందులో సరైన శాస్త్రీయమైన విధానం లేదని పేర్కోన్నారు.
గత ఐదు సంవత్సరాలనుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు ఎఫ్ సిఐ లు చెరో ౭౦౦ కోట్ల చొప్పున మొత్తం రూ .1400 కోట్లను మిల్లర్లకు చెల్లించలేదని తెలిపారు . 2021 -22 యాసంగి పంట కొనుగోలు చేసే ప్రక్రియలో ఎఫ్ సి ఐ కేవలం ముడి బియ్యం కావాలని పేచీ పెట్టడంతో ససమస్యలు మొదలయ్యాయని తెలిపారు . ప్రతి రోజు 30 వేలనుండి లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఎఫ్ సి ఐ కే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు . కేంద్ర ప్రభుత్వం DWRA పంపిన ఎఫ్ ఆర్ కె బియ్యం నాణ్యత లేదని ఎఫ్ సి ఐ తిరస్కరించడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని డిమాండ్ చేసారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గల వైరుద్య్యాన్ని వివిధ కారణాలతో బియ్యాన్ని తిరస్కరించడం సరికాదన్నారు . గ్రామీణ ప్రాంతాలలో ఎంతోమందికి ఆధారమైన రైస్ మిల్ ఇండస్ట్రీని ఇరు ప్రభుత్వాల రహస్య ఎజెండా కు బలి పశువు కాకుండా బతుకు దెరువుకు ఆధారమైన ఈ ఇండస్ట్రీ ని కుట్రలు చేసి నిర్వీర్యం చేయొద్దని అయన వేడుకొన్నారు . ఈ సమావేశంలో పలు జిల్లాలకు చెందిన రైస్ మిల్లర్ల అధ్యక్షులు పాల్గొన్నారు .