STOP SUICIDE : యువత ఆత్మహత్యలకు కారణం..? రాచకొండ పోలీస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
STOP SUICIDE : యువత ఆత్మహత్యలకు కారణం..? రాచకొండ పోలీస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో యువత, విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రాచకొండ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మహత్యల నిర్మూలనకు ఓ అవేర్‌నెస్ వీడియో ఆదివారం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. తల్లిదండ్రులు కోప్పడ్డారని, ఫోన్ కొనివ్వలేదని, లవ్ ఫెయిల్యూర్, పరీక్షలో ఫెయిల్, అనుకున్న ర్యాంక్ రాలేదని, చిన్న చిన్న కారణాలే కాకుండ.. డిప్రెషన్, ఆవేశపూరిత మనస్థత్వం ఈ ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని వెల్లడించారు.

ఓ యువత ఆగండి.. ఆలోచించండి.. ఆత్మహత్యలు చేసుకొని అయిన వారికి దూరం కాకండని పిలుపునిచ్చారు. జీవితంలో పరీక్షలు మళ్ళీ వస్తాయని, నువ్వు లేని తల్లిదండ్రులకు నీ లాగా ఇంకెవ్వరు రారు.. యువత ఆనుకుంటున్న సమస్యలన్నీ 90 శాతం వారి ఊహ మాత్రమే.. అని అన్నారు. నీలో నిరూపించుకునే సత్తా ఉందని, ఈ దేశానికి యువతే వెన్నెముక.. ఆలోచించండి అనుకున్నది సాధించండి. రండి ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దాం.. అంటూ రాచకొండ పోలీస్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed