- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ గుర్తింపునకు కారణం ఎన్టీఆరే.. : మంత్రి KTR
దిశ బ్యూరో, ఖమ్మం/ఖమ్మం/వైరా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ శనివారం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి, భద్రాచలం నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఒక్క ఖమ్మంలోనే 1370 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి తొలుత వైరా నియోజకవర్గంలో పర్యటించారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో గోద్రేజ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం హెలీక్యాప్టర్ ద్వారా మమత మెడికల్ కళాశాలలో దిగి.. లకారం ట్యాంక్ బండ్ ను సందర్శించి ఎన్టీఆర్ పార్కును ప్రారంభించారు. అక్కడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను ప్రారంభించారు. రామచంద్రయ్యనగర్ సహా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ పార్కులను ప్రారంభించారు. తర్వాత ఖమ్మం మున్నేరు బ్రిడ్జిపై చేపట్టనున్న ప్రొటెక్షన్ వాల్, హైలెవెల్ కేబుల్ బ్రిడ్జి పనులకు శిలాఫలాకాలు ఆవిష్కరించి పనులు ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
రాములన్న మానవతావాది..
వైరా నియోజకవర్గంలో గుబ్బగుర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాములు నాయక్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రత్యేక కారణాల వల్ల టికెట్ కేటాయించకున్నా పార్టీ ఆదేశాలమేరకు కట్టుబడి పనిచేస్తున్నారని, గొప్ప మానవతావాదిగా కొనియాడారు. ఎమ్మెల్యేగా రాములునాయక్ వైరా ప్రజల మనసుతో పాటు, తన మనసు గెలుచుకున్నారని ప్రశంసించారు. పదవులు శాశ్వతం కాదని, గిరిజనులకు ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కేటాయించడం గొప్పవిషయమని రాములు నాయక్ తనతో అనేకసార్లు చెప్పారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే పదవి అనేది తనకు ఎండు గడ్డితో సమానమని, తనపై కేటీఆర్ ప్రేమ ఉంటే చాలని రాముల నాయక్ ప్రకటించటం ఆయన హుందా తనాన్ని తెలియజేస్తుందన్నారు. రాములు నాయక్ సహకారంతో మదన్ లాల్ వైరా ఎమ్మెల్యేగా గెలుస్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మదన్ లాల్ ను గెలిపించాలని సూచించారు.
అవకాశ వాదులు వస్తున్నారు..
తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కొంతమంది అవకాశవాదులు వస్తున్నారని వారి మాటలను నమ్మొద్దు అన్నారు. నియోజకవర్గాల్లో డబ్బులు ఇచ్చి ఓటర్లను కొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే 420 పార్టీ అని, ఆ పార్టీకే గ్యారెంటీ లేదని... ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు వందల పింఛన్ నుంచి రూ. 2000 ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు. పార్టీల్లో అవకాశం రాకపోతే పార్టీలు మార్చే నాయకులు మనకు వద్దని, నియోజకవర్గంలో టికెట్ రాకపోయినా రాములన్న మనకి గ్యారెంటీగా నిలిచారని ఇలాంటివారిని నమ్మాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
గోదావరి, కృష్ణ జలాలను ఓడిసిపట్టాం..
గోదావరి, కృష్ణ జలాలను ఓడిసిపట్టి రైతులకు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వనిదేనన్నారు. హరిత విప్లవం ద్వారా ఎన్నడూ చూడని విధంగా వరి ధాన్యం పండించి పంజాబ్, హర్యానాను తలదన్నేలా తెలంగాణ రాష్ట్రం మిగిలిందన్నారు. నీలి విప్లవం ద్వారా చెరువులు నిండుకుండల్లా మారి మత్స్యకారుల ద్వారా చేపల పెంపకం జరిగిందన్నారు. గులాబీ విప్లవం ద్వారా పశువు సంపద పెరిగిందని తెలిపారు. మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ గా ఉందని, శ్వేత(క్షీర) విప్లవం ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహంతో నష్టాల్లో ఉన్న పాల డైరీలను లాభాల బాటలో నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పసుపు విప్లవం ద్వారా పామాయిల్ వంటి నూనె ఉత్పత్తిలో తెలంగాణ రాబోయే రోజుల్లో ముందుంటుందని తెలిపారు.
ఎన్టీఆర్ స్థానం పదిలం..
కొందరికి పదవులు వన్నె తెస్తే.. కొందరు పదవులకే వన్నె తెస్తారని అలాంటి వ్యక్తుల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎంతో అప్తుడుగా, విశ్వవిఖ్యాత నటుడిగా పేరుగాంచారని తెలిపారు. రాముడు ఎలా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు గానీ.. ఎన్టీఆర్ మాత్రం ఆ రెండు పాత్రల్లో అద్భుతంగా జీవించాడని, రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆరే గుర్తుకు వస్తారని అన్నారు. భారతదేశంలో తెలుగువారికి గుర్తింపు రావడానికి ఎన్టీఆరే కారణమన్నారు. చరిత్రలోని మహనీయుల స్థానంలో ఎన్టీఆర్ స్థానం పదిలంగా ఉంటుందని, ఆయన విగ్రహాన్ని, ఆయన పేరున ఉన్న పార్కుని ప్రారంభించడం తన అదృష్టమని కేటీఆర్ పేర్కొన్నారు.