- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
దిశ, ముషీరాబాద్ : పార్లమెంట్‌లో 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఆమోదించారు, కానీ హక్కుల పరిరక్షణ చట్టంలో ఉన్న అంశాలను మాత్రం నేటికీ ప్రభుత్వాలు ఆచరణలో అమలు చేయడం లేదని పశ్చిమబెంగాల్ మాజీ విద్యా శాఖ మంత్రి క్రాంతి గంగూలీ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన క్రాంతి గంగూలీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. పార్లమెంటులో ఆమోదించిన వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు తక్షణమే ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. దివ్యాంగులకు ప్రతినెల పెన్షన్ను రూ.5000 మంజూరు చేయాలని ఆయన కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేస్తూ టాక్సీ లలో రాయితీలు కల్పిస్తూ వికలాంగులకు మాత్రం పెన్షన్ పెంచాలంటే నిధులు లేవని చెప్పడం శోచనీయమన్నారు. ఢిల్లీలో రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా వీరోచితమైన పోరాటం చేసి వాటిని ఉపసంహరించే విధంగా ఉద్యమించారని, ఉద్యమ స్ఫూర్తితోనే వికలాంగులు సైతం హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎన్పీఆర్డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ మాట్లాడుతూ ఆసరా పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం విధించిన ఆదాయపరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నియమిస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో ఐదు శాతం వికలాంగులకు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నీ సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యతగా వికలాంగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. దళిత బంధు మాదిరిగానే వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కోసం ఎలాంటి షరతులు లేకుండా రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. బహిరంగ సభకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యురాలు సిహెచ్ సాయమ్మ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, మోహిన్, కార్యదర్శి ఎం. అడివయ్య, విద్యాసంస్థల అధినేత పటాన్ ఉమర్ ఖాన్ ఇతరులు పాల్గొన్నారు.