అట్టహాసంగా 'రామప్ప వైభవం'

by GSrikanth |
అట్టహాసంగా రామప్ప వైభవం
X

దిశ, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం 'రామప్ప వైభవం' పేరుతో ఘనంగా జరిగింది. ఈ రామప్ప సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ హాజరయ్యారు. ప్రముఖ సంగీత వాయిద్యకారుడు, పద్మశ్రీ గ్రహీత శివమణి తనదైన ప్రదర్శనతో అబ్బురపరిచాడు. కళాకారుల నృత్య ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గతంలో ములుగు ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఏజెన్సీ ప్రాంతమైన ములుగుని జిల్లాగా ప్రకటించి అభివృద్ధి చేసేందుకు ములుగు గ్రామపంచాయతీ సైతం మున్సిపాలిటీగా ప్రకటించారని, రామప్ప ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed