- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవర్ కమిషన్ నన్ను ఏమీ చేయలేదు.. జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : ఏ పార్టీ కార్యాలయాలకూ అనుమతుల్లేవని, మసీదు, గుడులు, చర్చీలకు కూడా అనుమతులుండవని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇప్పటి వరకు నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని ఏ పార్టీ కార్యాలయాలకు అనుమతులు ల్లేవన్నారు. నల్లగొండ బస్టాండ్ చుట్టు పక్కల ఉన్న పార్టీల కార్యాలయాలు మడిగల నిర్మాణం చేసుకొని అద్దెలు వసూళ్లు చేస్తుకుంటున్నాయని, ప్రభుత్వానికి మాత్రం పన్నులు ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. నల్లగొండలో మా పార్టీకి మెయిన్ చౌరస్తాలో ఉన్న విలువైన స్థలం ఉందని, దాని కోసమే మంత్రి కోమటిరెడ్డి కేవలం కూల్చివేతలకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు.
మా పార్టీకి చెందిన ఒక నేత అత్యుత్సాహంతో పార్టీ కార్యాలయం క్రమబద్ధీకరణ కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ‘అయ్యగారు లేనిదే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక నేత బయటకు రాడు... ఏ పని చెయ్యడు’ అని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్‌బీసీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసేది లేవు.. సచ్చేది లేదన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే గతంలో కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయిందని ప్రశ్నించారు. పవర్ కమిషన్ ఊసే లేదు అని, ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలకు నేతలకు సంబంధం ఉండదని, అందులో వెంట్రుక వాసం కూడా అవినీతి జరుగలేదన్నారు. పవర్ కమిషన్ నన్ను ఏం చేయలేదని స్పష్టం చేశారు.