- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fire Accident: మెడికల్ కాలేజీలో భారీ అగ్ని ప్రమాదం.. పది మంది చిన్నారులు సజీవ దహనం
దిశ, వెబ్‌డెస్క్: అగ్ని ప్రమాదం (Fire Accident)లో పది మంది శిశువులు సజీవ దహనమైన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ఝాన్సీ మెడికల్ కాలేజీ (Jhansi Medical College)లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలేజీలోని ఎన్ఐసీయూ (NICU) వార్డులో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో వార్డు అంతటా వేగంగా మంటలు వేగంగా వ్యాపించాయి. గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అనంతరం ఎన్ఐసీయూ వార్డు (NICU Ward)లోని 40 మంది పిల్లలను ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అందులో 10 మంది చిన్నారులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఝాన్సీ జిల్లా (Jhansi District)లోని మెడికల్ కాలేజీ ఎన్‌ఐసీయూ (NICU)లో జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరమని, హృదయ విదారకమని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులను ఆదేశించారు. మరణించిన వారి ఆత్మలకు మోక్షం కలగాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడు శ్రీరాముడిని ప్రార్థిస్తున్నా అంటూ సీఎం యోగి ట్వీట్ చేశారు.