- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయి పల్లవి బిగి కౌగిలిలో నలిగిపోతున్న ఆ హీరో.. చూడటానికి ఎంత ముద్దుగా ఉందో(పోస్ట్)
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'తండేల్'. దీనికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. అయితే ఈ చిత్రం మత్స్యకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ రానున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. బుజ్జి తల్లి అంటూ సాగే మొదటి పాటను ఈ నవంబర్ లోనే రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఇక ఈ పోస్టర్‌ను గమనించినట్లయితే.. హీరోయిన్ సాయి పల్లవి బిగి కౌగిలిలో నాగచైతన్య బందీ అయ్యి కనిపించాడు. కేవలం ఈ ముద్దుగుమ్మ ఫేస్ మాత్రమే కనిపించింది. ప్రేమికుడును చూసిన ఆనందం ఆమె ముఖంలో కనిపిస్తుంది. ఇక ఇప్పటికే బుజ్జితల్లే.. వచ్చేస్తున్నా కదే.. కూసింత నవ్వరాదే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఈ సాంగ్ కూడా బుజ్జి తల్లి గురించే అని అర్ధం అవుతుంది. పోస్టర్‌లో సాయిపల్లవి సిగ్గుపడుతూ ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.