AP Govt:స్కూళ్ల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Jakkula Mamatha |
AP Govt:స్కూళ్ల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధి(State Development) దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం విద్యాశాఖ(Department of Education) పై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా కూటమి ప్రభుత్వం స్కూళ్లకు పై కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 నుంచి ప్రాథమికోన్నత పాఠశాల(Primary school) విధానాన్ని తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6, 7, 8 తరగతుల్లో 30 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉంటే ప్రైమరీ, 60 కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలగా మార్చనుంది. అలాగే బేసిక్, ఆదర్శ స్కూళ్లను ప్రభుత్వం నిర్వహించనుంది. బేసిక్‌లో 20 మందిలోపు పిల్లలుంటే ఒక SGT, 60 మందికి 2 SGT, ఆ పైన ప్రతి 30 మందికి అదనంగా ఒక SGTని, ఆదర్శ స్కూల్‌లో ప్రతి తరగతికి ఓ SGTని కేటాయిస్తుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు(school) ప్రారంభం కావడానికి ముందు లేదా తర్వాత, సెలవు రోజుల్లోనూ ప్రైవేట్ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు శుక్రవారం స్పష్టం చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు హెచ్చరించారు.

Advertisement

Next Story