రాజకీయ దురంధరుడు ధర్మపురి శ్రీనివాస్.. పాలిటిక్స్‌లో తనదైన ముద్ర

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-29 05:37:26.0  )
రాజకీయ దురంధరుడు ధర్మపురి శ్రీనివాస్.. పాలిటిక్స్‌లో తనదైన ముద్ర
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ధర్మపురి శ్రీనివాస్... నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను రెండు దశాబ్దాలు శాసించిన నేత. ఇంటి పేరులొ ధర్మపురి కలిగిన డీఎస్ ఆ పేరుకు రాజకీయాల్లో స్థిరమైన స్థానాన్ని కల్పించారు. సామాన్యమైన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అలంకరించిన రాజకీయవేత్త ధర్మపురి శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లాలో 1980 దశకంలో సీనియర్ రాజకీయ నేత అర్గుల్ రాజారాం శిష్యులుగా కాంగ్రెస్ నాయకులకు పేరు ఉంది. ఆయన శిష్యుడిగా అంచలంచెలుగా ఎదుగుతూ రాజకీయాలలో ఓనమాలు దిద్దుకొని రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి దానికి తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 1987 లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమితోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు . 1989 తొమ్మిదిలో తొలిసారి నిజామాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆనాడు సీనియర్ నాయకుడిగా అప్పుడు రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రు లు గా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగాను పనిచేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 1999లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆనాడు కాంగ్రెస్ శాసనసభ‌పక్ష ఉపనేతగా పనిచేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనుహ్యంగా పిసిసి చీఫ్ గా ఎన్నికయ్యారు ధర్మపురి శ్రీనివాస్.. 2004, 2009 ఎన్నికలలో పిసిసి చీఫ్ గా ధర్మపురి శ్రీనివాస్, వైయస్ రాజశేఖర్ రెడ్డి లు కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి రావడంలో కృషి చేశారు. 2004లో గెలిచిన ధర్మపురి శ్రీనివాస్ ఆనాడు వైఎస్ క్యాబినెట్‌లో కీలకమైన గ్రామమైన గ్రామీణ అభివృద్ధి శాఖతోపాటు పలు కీలకమైన పోర్ట్‌ఫోలియోలతో మంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిఎస్ ఓటమి పాలు కావడం ఆయన రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బగా చెప్పాలి.

కానీ 2009లో అక్టోబర్ 9న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు. అయితే అప్పటికి డీఎస్ ఎమ్మెల్యేగా లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి అనుహ్యా oగా మిస్సైంది. తెలంగాణ రాష్ట్రం కోసం వైఎస్ మరణం తర్వాత మలిదశ ఉద్యమం ఊపందుకుంది. 2011లో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన డిఎస్ తనను గెలిపిస్తే తెలంగాణను బంగారు పళ్లెంలో తెచ్చి ఇస్తానని తానే ముఖ్యమంత్రి అవుతానని ప్రచారం చేసిన ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేతగా పనిచేశారు.

అయితే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి శ్రీనివాస్ తాను మూడుసార్లు గెలిచిన నిజామాబాద్ స్థానాన్ని వదులుకొని నిజామాబాద్ రూరల్ స్థానానికి మారి పోటీ చేసిన అక్కడ ఓటమిపాలయ్యారు. అయితే అప్పటివరకు శాసనసభ పక్ష నేతగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీగా మరొకసారి అవకాశం కల్పించకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ పై కినుకు వహించారు. అదే సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ ధర్మపురి శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కెసిఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరిన ధర్మపురి శ్రీనివాస్ తొలుత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. తర్వాత డిఎస్ రాజ్యసభలుగా నామినేట్ చేశారు కేసీఆర్. రాజకీయపరంగా ధర్మపురి శ్రీనివాస్ కు అదే చివరి రాజకీయ పదవి. తర్వాత కాలంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు...

Advertisement

Next Story