- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేకాటరాయుళ్ల కోసం పోలీసులు కూలీల వేషం.. స్కెచ్ మామూలుగా లేదుగా!
దిశ, డైనమిక్ బ్యూరో: సినిమాల్లో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు మారు వేషాలు వేసి దొంగలకు పట్టుకుంటుంటారు. అయితే, నిజ జీవితంలో సైతం పోలీసులు మారు వేశంలో తిరుగుతుంటారని తాజాగా జరిగిన ఘటన చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే, ఇక్కడ దొంగలను కాకుండ పేకాటరాయుళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టకునేందుకు జిల్లా స్థానిక పోలీసులు ప్రయోగం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బందనకల్ గ్రామ శివారు ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతున్నారు. పంట పొలాల మధ్యలో మంచిగా ఓ చెట్టు నీడలో ఒక టేబుల్ వేసి కూర్చీలు ఏర్పాటు చేసుకుని పేకాట ఆడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే పేకాట రాయుళ్లను పట్టుకునేందుకు పోలీసులు ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలోనే కూలీల వేషం వేశారు.
ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా పేకాట ఆడుతున్నారని, పోలీసులు రాగానే పరుగులు తీస్తుండటంతో వారిని సునాయాసంగా పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్ వేశారు. అనుకున్నట్లే పేకాట స్థావరం దగ్గరికి వెళ్లారు. పోలీసులను వ్యవసాయ కూలీలుగా భావించి.. పేకాట రాయుళ్లు దర్జాగా పేకాట ఆడుతున్నారు. పోలీసులు వారిని చుట్టుముట్టారు. దీంతో పేకాటరాయుళ్లు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులు జలక్ ఇచ్చి ఏడుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనిక సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల ఐడియాను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.