- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సంచలనంగా ఫోన్ ట్యాపింగ్ కేసు.. లిస్టులో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు..!
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ అలజడి కలిగిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచారణ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులపై, పోలీసు అధికారులపై ఉన్న స్థాయిలో విచారణ కొనసాగుతూ వస్తోంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కొన్ని ఆధారాలతో డీజీపీకి స్వయంగా ఫిర్యాదు చేశారు. తన ఫోన్లు, తన అనుచరులతో పాటుగా పలువురు కాంగ్రెస్ నాయకులు, వేలాది మంది ప్రజల ఫోన్లను ట్యాప్ చేశారని అప్పట్లోనే ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వడంతో పాటు మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లానూ తాకింది. నాగర్‌కర్నూల్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజులకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్న, ప్రస్తుత ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్న నాయకులు, అధికారులతో సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించారని ప్రచారం జరిగింది. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా తమను కలిసిన నాయకుల వివరాలు బీఆర్ఎస్ నేతలకు చేరినట్లుగా అప్పట్లోనే కాంగ్రెస్ నాయకులు అనుమానించారు. అయితే అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ఉనికిలో లేకపోవడంతో కాంగ్రెస్ నాయకుల్లో కోవర్టుల భయమే కలిగింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో తమ ఫోన్లూ ట్యాపింగ్ అయ్యాయనే అనుమానాలు నిజాలు కావచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేలకు ప్రమేయం ఉందనే నోటీసులు అందాయని ప్రచారం ఆయా నియోజకవర్గాల్లో సంచలనంగా మారింది. ఈ అంశంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం కలిగిస్తుంది. కాగా దీన్ని కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ కొట్టిపారేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోననే చర్చ జోరుగా జరుగుతుంది.