- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: 66 కోట్ల మంది డేటా లీక్ చేసిన వ్యక్తి అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: సంచలనం రేపుతోన్న డేటా లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 66 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటా లీక్ చేసిన ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 24 రాష్ట్రాల్లోని 8 మెట్రోపాలిటిన్ సిటిల్లో డేటా చోరీ అయినట్లు పోలీసులు గుర్తించారు. పౌరుల వ్యక్తిగత డేటాను తస్కరించేందుకు 6 మెట్రోపాలిటిన్ సిటిల్లో ఏకంగా 4.5 లక్షల మంది ఉద్యోగులను భరద్వాజ్ నియమించుకున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
పాన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఇన్ కంట్యాక్స్, డిఫెన్స్ రంగాలకు చెందిన పౌరుల డేటా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీలైన బై జ్యూస్, వేదాంత సంస్థల విద్యార్థుల డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా.. జీఎస్టీ, ఆర్టీవో, నెట్ ప్లిక్స్, అమెజాన్, యూట్యూట్, పేటిఎం, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, ఇన్ స్టా గ్రామ్ యూజర్స్ డేటా కూడా నిందితుడి వద్ద పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.