సింగరేణి కంచెను తొలగించిన ఎమ్మెల్యే.. ఆనందం వ్యక్తం చేసిన రైతులు

by Shiva |
సింగరేణి కంచెను తొలగించిన ఎమ్మెల్యే.. ఆనందం వ్యక్తం చేసిన రైతులు
X

దిశ, వెబ్‌డెస్క్ : పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పాములపేట శివారులోని సింగరేణి స్థలంలో అధికారులు ఏర్పాటు చేసిన ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ రైతులు నడవకుండా దారికి అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెను డోజర్‌తో తొలగించారు. ఇకపై సింగరేణి మేడిపల్లి ఓసీపీ-4 ప్రాజెక్టు భూ నిర్వాసిత రైతులను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. కంచె అటువైపు ఉన్న పంట పొలాలు, గోదావరి నదికి వెళ్లే దారి ఉండడంతో కంచెను తొలగించాలని రైతులు కోరినా అధికారులు పట్టంచుకోలేదు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం కంచె వద్ద రైతులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ అక్కడికి చేరుకుని డోజర్‌తో కంచెను తొలగించి దారి ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story