దశాబ్ది ఉత్సవాల్లో మేయర్ తీరు వివాదాస్పదం..

by Rajesh |
దశాబ్ది ఉత్సవాల్లో మేయర్ తీరు వివాదాస్పదం..
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆమె నగర ప్రథమ పౌరురాలు. నలుగురికి మార్గదర్శకంగా ఉండాల్సిన మేయర్. అలాంటిది రాష్ట్ర అవతరణ వేడుకల్లో మధ్యలో నుంచి జాతీయ గీతాన్ని ఆలపించి మరోసారి వార్తల్లో నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని జీహెచ్ఎంసీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా మేయర్ విజయలక్ష్మి హాజరయ్యారు. జాతీయ జెండా ఎగురవేశారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపన జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జాతీయ గీతం సగం నుంచి ప్లే కావటం. అయినా, మేయర్ గానీ, అక్కడున్న అధికారులు గానీ ఎవ్వరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మధ్య నుంచి మొదలైన జాతీయ గీతాన్నే అందరూ ఆలపించి కార్యక్రమాన్ని ముగించేశారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed