‘మహాధర్నా’కు షరతులు.. 500 మంది దాటొద్దన్న హైకోర్టు

by Javid Pasha |
‘మహాధర్నా’కు షరతులు.. 500 మంది దాటొద్దన్న హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ పీఎస్సీ లీకేజీ అంశంపై బీజేపీ చేపడుతున్న ‘నిరుద్యోగ మహాధర్నా’కు ఎట్టకేలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ పలు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. కేవలం 500 మందితో మాత్రమే ధర్నా చేపట్టాలని హైకోర్టు స్పష్టంచేసింది. అంతేకాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఎవరైనా అలా ప్రవర్తిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది.

ఇదిలా ఉండగా ఈ మహాధర్నాకు నేషనల్ బీజేపీ లీడర్స్, మంత్రులు ఎవరెవరు వస్తున్నారో శుక్రవారం రాత్రి 9 గంటలలోపు పోలీసులకు చెప్పాలని బీజేపీ నేతలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ స్థాయి నేతలు వస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే ఈ ఆదేశాలు జారీ చేసిందని పలువురు చెబుతుండగా వారొస్తే మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలున్న నేపథ్యంలోనే హైకోర్టు ఈ ఆదేశాలు జారీచేసి ఉండవచ్చని ఇంకొందరు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed