- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ అరెస్ట్‌పై విచారణ.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్టుపై ఆ పార్టీ లీగల్ సెల్ తరఫున దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొని గడువు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని ఆయన నివాసం నుంచి అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పుతున్నారని, ఆయనను ఎందుకు అరెస్టు చేశారో నిర్దిష్ట కారణాలను పోలీసులు వెల్లడించడంలేదని బీజేపీ భాగ్యనగర్ అధ్యక్షుడు సురేందర్ బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీక్‌లతో కూడిన బెంచ్ గురువారం విచారించి నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను అప్పటికి వాయిదా వేసింది.
ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిందిగా బుధవారం చీఫ్ జస్టిస్‌ను ఆయన నివాసానికి వెళ్ళి కోరగా గురువారం ఉదయం విచారిస్తామని స్పష్టత ఇచ్చారు. ఆ ప్రకారం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ విచారించింది. లంచ్ మోషన్ పిటిషన్‌గా పరిగణించి విచారించాలని బీజేపీ తరఫు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు మధ్యాహ్నం విచారించి నాలుగు వారాల తర్వాత తదుపరి హియరింగ్ ఉంటుందని స్పష్టం చేసింది.