- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభుత్వం నాకు భద్రత పెంచాలి.. అగంతకుడి చొరబాటు ఘటనపై ఎంపీ డి.కె అరుణ

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలోని జూబ్లీహిల్స్ తన నివాసంలో ఆగంతకుడు చొరబడిన ఘటనపై ఎంపీ డీకే అరుణ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గతరాత్రి హైదరాబాద్ లోని నా ఇంట్లో జరిగిన ఆగంతకుడి చొరబాటు ఘటన భయాందోళన కలిగించిందని, నా భద్రతపై అనుమానాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి ఉండే ప్రాంతంలో ఉంటానని, అయినా దుండగులు చొరబడటం కలిచివేసిందన్నారు. గతరాత్రి ఓ దుండగులు నా ఇంట్లోకి వెనక వంట గదిలోకి ప్రవేశించి గంటన్నర పాటు కలియతిరిగి వెళ్లిపోయాడని పేర్కొంది. ఇది ముమ్మాటికీ అనుమానాలకు తావిస్తోందని, అసలు దుండగులు నా ఇంట్లోకి ఎందుకు చొరబడ్డారో అనే విషయం ఆలోచిస్తేనే భయం వేస్తోందని తెలిపారు. గత రెండు రోజులుగా తాను మహబూబ్ నగర్ లోనే ఉన్నానని, శనివారం అర్థ రాత్రి 3 గంటలకు కిచెన్ కిటికీ తీసి ఇంట్లోకి వచ్చారని, ఇల్లంతా ఒక గంటన్నర పాటు కలియతిరిగారని ఆదివారం ఉదయం 6 గంటలకు నాకు విషయం తెలిసిందన్నారు.
కిచెన్ లో కెమెరా కట్ చేసి, కింద గ్లాస్ తీసేసి ఇంట్లోకి వచ్చాడని, ముఖానికి మాస్క్, గ్లౌస్, బ్యాగ్ ,షూ ధరించాడని తెలిపింది. పస్ట్ ఫ్లోర్ లోకి వెనుక భాగం నుంచి కిచన్ కిటికిలోంచి లోనికి లోపలికి వచ్చాడని, నక్కి నక్కి తిరుగుతూ రెక్కీ చేసిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. కిచెన్ లో కెమెరా కట్ చేశాడని, డైనింగ్ హాల్ లో కెమెరా తిప్పి, డ్రాలు తెరిచి వస్తువులు చిందర వండర పడేశాడు. ఫస్ట్, సెకెండ్ అంతస్థులో అన్నిరూములు తిరిగాడని తెల్లజామున 4:30 గంటలకు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఊహించుకుంటేనే భయం వేస్తోందని, అగంతకుడు వచ్చినప్పుడు ఇంట్లోవాళ్లు ఎవరైనా చూసి ఉంటే చంపేసేవాడేమో ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయం వేస్తోందన్నారు.
నాకు భద్రత పెంచాల్సిందే.. డీకే అరుణ
నా ఇంట్లోకి దుండగుడు చొరబడిన విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, నాకు సెక్యూరిటీపై సీఎం స్పందించాలని డిమాండ్చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీతో కూడా మాట్లాడి జరిగిన విషయం చెప్పి హైసెక్యూరిటీ భద్రత కల్పించాలని కోరినట్లు చెప్పారు. గత కొన్న రోజుల క్రితమే నా భర్తకు గన్ మెన్స్ విషయం కూడా లేఖ రాశానని, ముఖ్యమంత్రి ఈ ఘటనపై సీరియస్ గా స్పందించాలన్నారు. నా ఇంట్లి వద్ద హై సెక్యూరిటి భద్రత పెంచాలని కోరారు. అసలు నా ఇంట్లోకి చొరవబడింది ఎవరు, ఎందుకొచ్చారన్న విషయంపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. నాకు ఏదైనా ప్రాణ హాణి తల పెట్టాలని చూస్తున్నారమోనని, ఈవిషయంపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్చేశారు.
బీజేపీ ఎంపీ డీకే అరుణకు బండి సంజయ్ ఫోన్
సీసీ కెమెరాలు ఆఫ్ చేసి డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు చొరబడిన ఘటన పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అరా తీశారు. పోలీస్ ఉన్నతాధికారులకు బండి సంజయ్ ఫోన్ చేసి డీకే అరుణకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని కోరారు. ఆగంతకుడి చొరబాటు ఘటనపై లోతైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు.