- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్వింటాల్‌కు 10 కిలోలు.. తరుగు పేరిట గాయబ్
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లలో సర్కార్నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. క్వింటాల్‌కు పది కిలోలు తరుగు తీస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. యాసంగి వరి పంట 70 శాతం ధాన్యం చేతికొచ్చింది. అయినా కొనుగోలు కేంద్రాలు నామ మాత్రంగానే నడుస్తున్నాయి. గన్నీ బ్యాగుల సమస్యతో పాటు, తూకం వేసిన ధాన్యం తరలింపులో లారీలు సమకూర్చడంలో ఫెయిలయ్యారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. ‘తడిసిన ధాన్యం, మక్కలు అంతా కొంటాం. ఎలాంటి టెన్షన్అవసరం లేదు’ అంటూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట కిసాన్కాంగ్రెస్ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నారు.
సగం ధరకే..
ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మొదట్లో రూ.2200 పలికిన మొక్కజొన్న ఇప్పుడు దళారులు కేవలం రూ.1400కే కొంటున్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తడిసిన పంటను కొనుగోలు చేయాలని సర్కార్స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అకాల వర్షాలతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎకరానికి రూ.10 వేలు సహాయం ఇప్పటికీ అందలేదు.
ఆ రెండు నెలలు..
మార్చి, ఏప్రిల్ నెలల్లో పడిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మే నెలలో వర్షాలతో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. వడగండ్ల వానలకు మొక్కజొన్న పంట నేలకొరిగి మొలకలు వచ్చాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోయింది. పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
చేయూతనివ్వని సర్కార్
అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పినా అది జరగడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు దగాకు గురవుతున్నారు. వరి, మొక్కజొన్న పంటలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించాలి. రుణాలను రీ–షెడ్యూల్ చేయాలి. రుణ మాఫీ అమలు చేయాలి. - అన్వేష్‌రెడ్డి సుంకేట, కిసాన్కాంగ్రెస్చైర్మన్
Read More: 150 వార్డుల్లో పరిపాలన.. నియామకాలపై జీహెచ్ఎంసీ ఫోకస్!
ఎన్నికలే టార్గెట్..! ఆ పార్టీకి ఓట్లు మళ్లితే ప్రాబ్లమ్ అని BRSలో టెన్షన్?
పార్టీలో చేరిక ముహూర్తం రివీల్ చేసిన పొంగులేటి.. కీలక ప్రకటనపై క్లారిటీ!