ముహుర్తం ఫిక్స్.. సెక్రటేరియట్ హెచ్‌వోడీలకు సర్కార్ కీలక ఆదేశం..!

by Satheesh |   ( Updated:2023-04-25 11:02:41.0  )
ముహుర్తం ఫిక్స్.. సెక్రటేరియట్ హెచ్‌వోడీలకు సర్కార్ కీలక ఆదేశం..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే హంగులతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయం ఈ నెల 30వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఓపెనింగ్‌కు పనులు చక చక జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటికే నూతన సచివాలయ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే బీఆర్కే భవన్ నుండి కొత్త సెక్రటేరియట్ భవనంలోకి డిపార్ట్ మెంట్ల షిఫ్టింగ్ పనులు ప్రారంభం అయ్యాయి.

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 30వ తేదీన ప్రారంభోత్సవానికి సెక్రటేరియట్ సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే, సెక్రటేరియట్‌లోని అని శాఖల విభాగాధిపతులకు కీలక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ నెల 30వ తేదీన నూతన సచివాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో అదే రోజు సెక్రటేరియట్ అన్ని శాఖల విభాగాధిపతులు మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 నిమిషాల మధ్య బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed