రూ.826 కోట్లతో KBR పార్క్ చుట్టూ 6 జంక్షన్లు.. ఆమోదించిన ప్రభుత్వం

by Mahesh |
రూ.826 కోట్లతో KBR పార్క్ చుట్టూ 6 జంక్షన్లు.. ఆమోదించిన ప్రభుత్వం
X

దిశ, హిమాయత్ నగర్: హైదరాబాద్ రోడ్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి హెచ్‌సీఐటీఐ ప్రాజెక్ట్‌లో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనపై జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న మొత్తం 6 జంక్షన్ల అభివృద్ధి కోసం 826 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఆమోదం తెలిపారు. కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) పార్క్ హైదరాబాద్ సెంట్రల్ ఏరియాలో జూబ్లీహిల్స్‌లో ఉంది. పార్క్ యొక్క పెరిఫెరల్ రహదారిని కలిపే రోడ్లు నగరం యొక్క ఒక భాగం నుండి ఇతర భాగానికి ట్రాఫిక్‌ను అన్ని దిశలలోకి తీసుకెళ్లడానికి ప్రధాన రహదారుల పనిచేస్తాయి. కేబీఆర్ పార్క్ రోడ్డు అంచున ఆరు ప్రధాన జంక్షన్లు ఉన్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అనుసంధానించే రహదారులతో పని, వ్యాపార, వాణిజ్య ప్రయాణాలకు ఈ జంక్షన్‌ల మీదుగా ట్రాఫిక్ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ జంక్షన్లు ట్రాఫిక్ సిగ్నల్స్ యూటర్న్‌తో నిర్వహించబడుతున్నాయి.

ఈ జంక్షన్‌ల యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, ఈ క్రింది రెండు ప్యాకేజీలలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఆరు జంక్షన్‌లలో క్రింది గ్రేడ్ సెపరేటర్‌లు మొత్తం రూ: 826.00 కోట్లతో ప్రతిపాదించబడ్డాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేశారు. జంక్షన్లు మొత్తం ఏరియా అంతా ఘర్షణ రహితంగా ఉండేలా అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఎక్కడా సిగ్నల్ ఉండకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేలా డిజైన్ చేశారు. సవ్యదిశలో వెళ్లే ట్రాఫిక్ అండర్‌పాస్‌ల శ్రేణిలో ప్రయాణిస్తుంది. అయితే అపసవ్య దిశలో వెళ్లే ట్రాఫిక్ వరుస ఫ్లై ఓవర్ల గుండా ప్రవహిస్తుంది. వర్షాకాలంలో ఈ ప్రదేశాలు అడ్డంకులుగా మారకుండా చూసేందుకు అండర్‌పాస్‌ల కింద వర్షపు నీటిని నిలుపుకునే నిర్మాణాల డిజైన్‌లను జీహెచ్ఏంసీ పొందుపరిచింది. ఇటీవల ఆరు జంక్షన్ల అభివృద్ధి నమూనా వీడియోలను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. ఆరు జంక్షన్‌ల నిర్మాణంతో హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రాజెక్టు వివరాలు ఇలా ఉన్నాయి.

మొదటి దశ చేపట్టే పనులుప్యాకేజీ-I

( మొత్తం రూ.421 కోట్లలో )

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్

1) రోడ్డు నంబర్ 45 నుండి కేబీఆర్ యూసుఫ్‌గూడ వరకు 'వై' ఆకారపు అండర్‌పాస్

2) కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్ నుండి రోడ్ నెం.36 వైపు 4 లేన్ ఫ్లైఓవర్.

3) యూసుఫ్‌గూడ వైపు నుండి రోడ్ నెం.45 జంక్షన్ వైపు 2 లేన్ ఫ్లైఓవర్

కేబీఆర్ ప్రవేశం ముగ్ధా జంక్షన్

1) జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుండి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు 2 లేన్ అండర్‌పాస్.

2) పంజాగుట్ట వైపు నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు 3 లేన్ యూని డైరెక్షనల్.

3) కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ నుండి పంజాగుట్ట వైపు 3 లేన్ అండర్ పాస్

రెండో దశ చేపట్టే పనులు ప్యాకేజీ-II

( మొత్తం రూ. 405.00 కోట్లలో )

జంక్షన్ పేరు: రోడ్ నెం 45 జంక్షన్

*ఫిల్మ్ నగర్ జంక్షన్ నుండి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వైపు 2 లేన్ అండర్‌పాస్

*జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ నుండి రోడ్ నెంబర్ 45 వైపు 2 లేన్ ఫ్లైఓవర్.

ఫిల్మ్ నగర్ జంక్షన్

*మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుండి రోడ్ నెం.45 జంక్షన్ వైపు 2 లేన్ అండర్ పాస్.

*ఫిల్మ్ నగర్ జంక్షన్ నుండి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ ఫ్లైఓవర్.

మహారాజా అగ్రసేన్ జంక్షన్

*క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుండి ఫిల్మ్ నగర్ జంక్షన్ వైపు 2 లేన్ అండర్ పాస్

*ఫిల్మ్ నగర్ జంక్షన్ నుండి రోడ్ నెంబర్ 12 వైపు 2 లేన్ ఫ్లైఓవర్.

క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్

*కేబీఆర్ పార్క్ వైపు నుండి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ అండర్ పాస్.

*మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుండి రోడ్ నెం.10 వైపు 2 లేన్ ఫ్లైఓవర్.

Advertisement

Next Story

Most Viewed