క్యాంపునకు బయలుదేరిన డైరెక్టర్లు..

by Sathputhe Rajesh |
క్యాంపునకు బయలుదేరిన  డైరెక్టర్లు..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూరు ప్రాథమిక సహకార సంఘం అవిశ్వాస ఛాయలు కమ్ముకున్నాయని కొన్ని రోజుల క్రితం దిశ ప్రచురించింది. అన్నట్టుగానే అవిశ్వాసం పెట్టారన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. పదిమంది డైరెక్టర్లతో క్యాంపునకు డైరెక్టర్లు బయలుదేరారు. 15 రోజుల వ్యవధి ముందే బయలు దేరడంతో దీని వెనుక ఎవరున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఒకే ఒక స్థానాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడా? అనే చర్చ జోరందుకుంది.

బీజేపీ రాష్ట్రంలోనే ఒకే ఒక ప్రాథమిక సహకార సంఘం కైవసం చేసుకుంది. ఓకే ఒక స్థానం ఉండగా ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం పెద్దూర్ స్థానం చేజారుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఉన్న స్థానాన్ని కాపాడుకోలేని బండి సంజయ్ రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడని చర్చ ఊపందుకుంది. మంత్రి గంగుల కమలాకర్ అన్నట్టుగానే అవుతుందా? అని విమర్శకులు అంటున్నారు. ప్రజాభిప్రాయం మేరుకు గెలిచిన ఒక ఆడబిడ్డ స్థానాన్ని, గుంజుకుంటున్నారా? ఆడబిడ్డ కన్నీటి వేద మంచిది కాదని కొంతమంది అభిప్రాయ‌పడుతున్నారు.

Advertisement

Next Story