- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మామను దారుణంగా కొట్టిన కోడలు.. ఎందుకంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: వృద్ధులైన తల్లిదండ్రులను వారి కొడుకులు, కోడళ్లు అనాధ ఆశ్రమంలో వదిలి పెట్టడం, లేదా వారిని తీవ్రంగా హింసించడం తరుచుగా చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఓ అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు చెందిన ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి. భర్త విదేశాల్లో ఉండడంతో ఆమె అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. అయితే తన మామ పద్మనాభ సువర్ణ (87) సోఫాపై షర్ట్ పెట్టాడన్న కోపంతో వాకింగ్ స్టిక్‌తో విచక్షణ రహితంగా కొట్టింది. కొట్టడమే కాకుండా మామను బలంగా నెట్టేయడంతో సోఫాకు తల తగిలి గాయమైంది. ఇదంతా ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
మార్చి 9 వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అయ్యింది. అయితే ఈ దాడిని గల్ఫ్ దేశంలో ఉన్న ఆమె భర్త సీసీటీవీ ఫుటేజీ వీడియో చూశారు. ఈ క్రమంలోనే ఆమెను స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకోని అదుపులోకి తీసుకున్నారు. కాగా, వృద్ధుల రక్షణ కోసం కఠిన చట్టాలు, సంక్షేమ విధానాల అమలు అవసరమని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.